Ongole Nagarjuna Sagar Airports: ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు, నాగార్జునసాగర్‌లో కొత్త విమానాశ్రయాలు రానున్నాయి. వీటి నిర్మాణానికి సాంకేతిక, ఆర్థిక సాధ్యత నివేదిక కోసం బిడ్లను ఆహ్వానిస్తూ ఏపీఏడీసీఎల్ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, ఎస్‌పీఎస్ అధికారులకు ఐపీఎస్ ప్రమోషన్ల కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సస్వర్ణాంధ్ర-2047లో భాగంగా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలకు రూ.20.10 కోట్ల నిధులు విడుదలయ్యాయి. అమరావతి పరిపాలన నగరానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. శ్రీశైలం ప్రాజెక్టులో మరమ్మత్తుల కోసం సీలైన్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు.