విమాన టిక్కెట్ల ధరలు భారీగా తగ్గాయి – దుబాయ్ నుండి ఇండియా లో ఎక్కడికైనా కేవలం 4000 రూపాయలకే ..Dubai to India flight tickets
అందరికీ నమస్కారం
నేను మీ DKTV తెలుగు ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. మేము మీకు ప్రతిరోజూ మీకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారం అందిస్తాము , తాజా సమాచారం, ఉపయోగపడే సమాచారం అందిస్తూనే ఉంటాం. మా DKTV తెలుగు ఛానల్లో మీరు బంగారం ధరలు, స్టాక్ మార్కెట్కి సంబందించిన వార్తలు, మెటల్స్ ( రాగి ,అల్యూమినియం ,ఐరన్ ,స్టీల్,ఇత్తడి ) & ప్లాస్టిక్ (pvc ,ldpe ,hdpe ,pp , ) మొదలగు వాటి ధరలు అందిస్తాము , రాజకీయ వార్తలు, అలాగే ప్రయాణానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.
ఇక ఈరోజు మీ కోసం ఇసుకువచ్చిన టాపిక్ – దుబాయ్ నుండి ఇండియాకు వెళ్ళే విమాన టికెట్ ధరలు భారీగా తగ్గాయి . ఇంతకు ముందు పదిహేనువేల నుండి ఇరవై వేల వరకుఉండే టికెట్లు ఇప్పుడు కేవలం నాలుగు నుండి ఐదు వేల రూపాయలకే వస్తున్నాయి
ఈ ధరలు తగ్గటానికి కారణాలు , ధరలు తగ్గటం వలన ఎవరకి ఉపయోగం , ఎంతకాలం వరకు కొనసాగుతాయి, వీటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం .
(Dubai to India flight tickets)దుబాయ్ మరియు యుఏఈ ప్రాంతాల నుండి భారతదేశానికి ప్రయాణించే విమాన టికెట్ ధరలు ఈ మధ్యకాలంలో భారీగా తగ్గాయి. గల్ఫ్ న్యూస్ అందించిన సమాచారం ప్రకారం, సాధారణంగా 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు ఉండే టికెట్లు ఇప్పుడు కేవలం 220 దిర్హామ్‌లకు, అంటే భారత కరెన్సీ ప్రకారంసుమారుగా 4000 రూపాయలకే లభిస్తున్నాయి. ఈ తక్కువ ధరలు రావడానికి ప్రధాన కారణం సమ్మర్ వెకేషన్ ముగియడం మరియు పిల్లలు స్కూల్‌లకు తిరిగి వెళ్ళడం వల్ల కుటుంబాలు ప్రయాణించడం మానేయడం. వేసవి కాలంలో చాలా మంది కుటుంబాలు భారత్‌కి వెళ్ళి తిరిగి వచ్చారు. ఇప్పుడు కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది కాబట్టి పిల్లలతో కలిసి ప్రయాణించే వారు చాలా వరకు తగ్గిపోయారు. ఈ కారణంగా విమానాల్లో ప్రయాణించే వారు తగ్గారు . సరఫరా ఎక్కువగా ఉండి, డిమాండ్ తగ్గిపోవడంతో టికెట్ ధరలు భారీగా పడిపోయాయి. సాధారణంగా ఇంత తక్కువ ధరలు వస్తే బుకింగ్‌లు ఎక్కువగా జరుగుతాయి కానీ ఈ సారి పరిస్థితి వేరుగా ఉంది. టికెట్ ధరలు తక్కువైనా, ప్రయాణించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది ..
(Dubai to India flight tickets )కేరళ కి వెళ్ళే ప్రయాణికులకు అత్యంత చవకగా ఉన్నాయి. కన్నూర్‌కు కేవలం 155 దిర్హామ్‌లకే టికెట్ లభిస్తుంది. కొచ్చికి 223 దిర్హామ్‌లు, తిరువనంతపురానికి 250 దిర్హామ్‌లు మాత్రమే ఉన్నాయి . ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే సాధారణ రోజుల్లో ఇంత తక్కువ ధరలకు టికెట్లు దొరకవు. దుబాయ్ నుండి ముంబైకి 295 దిర్హామ్‌లు, చెన్నైకి 356 దిర్హామ్‌లు, బెంగళూరుకు 422 దిర్హామ్‌లు మాత్రమే. ఇంత తక్కువ ధరలు రావడం ప్రయాణికులకు నిజంగా మంచి అవకాశం. కానీ అదే సమయంలో ఒక సమస్య కూడా ఉంది. భారత్ నుండి యుఏఈకి తిరిగి వచ్చే టికెట్లు మాత్రం ఇంకా ఎక్కువ ధరలోనే ఉన్నాయి. ఒకవైపు టికెట్ చవకగా ఉన్నా, మరల రిటర్న్ ట్రిప్ తీసుకుంటే మొత్తం ఖర్చు ఎక్కువగానే అవుతుంది. ఈ కారణంగా చాలా మంది ప్రయాణికులు తక్కువ ధరలు ఉన్నా కూడా బుకింగ్ చేయడానికి వెనుకాడుతున్నారు.
స్మార్ట్ ట్రావెల్స్ చైర్మన్ అఫీ అహ్మద్ గారు గల్ఫ్ న్యూస్‌తో మాట్లాడుతూ, కన్నూర్‌కి 155 దిర్హామ్‌లకే టికెట్లు వస్తున్న , కొనేవారు లేరని చెప్పారు. పిల్లలు ఉన్న కుటుంబాలు ప్రస్తుతం ప్రయాణించడం లేదు. వేసవిలో ఎక్కువ మంది వచ్చి వెళ్లారు కాబట్టి ఇప్పుడు డిమాండ్ చాలా తగ్గిపోయింది. సాధారణంగా ఇంత తక్కువ ధరలు వస్తే విమానాల్లో బుకింగ్‌లు పెరుగుతాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా వేరుగా ఉందని ఆయన చెప్పారు
ప్రస్తుత పరిస్థితి ప్రయాణికులకు కొంతఉపయోగకరం కానీ, అత్యవసరంగా ఎవరికైనా భారత్‌కి వెళ్లాల్సి వస్తే ఇప్పుడు నాలుగు నుండి ఐదు వేల రూపాయలకే టికెట్ లభిస్తుంది . కానీ వెళ్ళేటపుడు మాత్రమే తక్కువ ధరకు లభిస్తుంది ,మరల తిరిగి వచేటపుడు టికెట్ ధరలలో ఏమాత్రం మార్పు లేదు పూర్వం లాగానే ఎక్కువ ధరలు వున్నాయి . ఉదాహరణకు దుబాయ్ నుండి హైదరాబాద్‌కు ఒకవైపు టికెట్ నాలుగు నుండి ఐదు వేలలో వస్తే, తిరిగి హైదరాబాద్ నుండి Dubai to India flight tickets దుబాయ్ వెళ్ళడానికి ఇరవై నుండి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చవుతుంది. ఈ పరిస్థితి చాలా మందిని ఆలోచింపజేస్తోంది.
అక్టోబర్ నెల రాగానే పరిస్థితి మళ్లీ మారుతుంది అని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ఎందుకంటే అక్టోబర్‌లో పాఠశాల సెలవులు వస్తాయి. అలాగే దీపావళి పండుగ కూడా ఉంది. ఈ సమయంలో భారతదేశానికి వెళ్ళే ప్రయాణికుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. అందువల్ల ఇప్పుడు చవకగా ఉన్న టికెట్ ధరలు త్వరలోనే పెరిగి 10,000 నుండి 15,000 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది దీపావళి సెలవుల కోసం ముందుగానే బుకింగ్‌లు చేసుకుంటున్నారు దీంతో రాబోయే రోజుల్లో ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది
దుబాయ్ మాత్రమే కాకుండా అబుదాబి నుండి కూడా తక్కువ ధరలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.Dubai to India flight tickets అంటే యుఏఈలోని అనేక ఎయిర్‌పోర్టుల నుండి భారతదేశానికి వెళ్ళే దాదాపు అన్నివిమానాలు తక్కువ ధరలో లభిస్తున్నాయి. విమాన సంస్థలు ఎక్కువ ఫ్లైట్లు నడుపుతున్నా ప్రయాణికులు తగ్గిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
కొంతమంది ప్రయాణికులు సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకున్నారు. కొందరు ఇంత తక్కువ ధరలు ఎప్పుడూ చూడలేదని చెబుతుంటే, మరికొందరు ఒకవైపు టికెట్తక్కువగానే ఉన్నా తిరిగి రావడానికి ఎక్కువ ఖర్చవుతుందని చెబుతున్నారు. దీపావళి ముందు టికెట్లు పెరుగుతాయని తెలిసి కొందరు ఇప్పుడే బుక్ చేసుకుంటున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు తమ అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటున్నారు.
మొత్తం మీద చూస్తే,Dubai to India flight tickets ప్రస్తుతం దుబాయ్ నుండి భారతదేశానికి వెళ్ళే విమానాల ధరలు చరిత్రలోనే అత్యంత తక్కువ ధరలకు లభిస్తున్నాయి. కేవలం నాలుగు నుండి ఐదు వేల రూపాయలకే టికెట్లు దొరకడం అంటే నిజంగా అరుదైన విషయం. అత్యవసరంగా ప్రయాణించాల్సిన వారికి ఇది గొప్ప అవకాశం. అయితే తిరిగి వచ్చే టికెట్ ధరలు ఎక్కువగానే ఉన్నందున రౌండ్ ట్రిప్ తీసుకునే వారికి పెద్దగా లాభం లేదు. అక్టోబర్ నుండి ధరలు మళ్లీ పెరగనున్నాయి కాబట్టి ఎవరికైనా ఇప్పుడు అవసరం ఉంటే ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి .
- Gulf News – దుబాయ్-ఇండియా ఫ్లైట్ ఆఫర్లు, గల్ఫ్ రీజియన్ ట్రావెల్ అప్డేట్స్ కోసం
- Air India Express – Cheap UAE–India Flights (లో-కోస్ట్ ఎయిర్‌లైన్)
ప్రశ్నలు మరియు సమాదానాలు
ప్రశ్న 1: Dubai to India flight tickets దుబాయ్ నుండి ఇండియా టికెట్ ధరలు ఎందుకు తగ్గాయి?
సమాధానం: సమ్మర్ సెలవులు ముగియడం, పిల్లలు స్కూల్‌లకు వెళ్ళడం వల్ల డిమాండ్ తగ్గిపోయింది.
ప్రశ్న 2: టికెట్లు ఎంత తక్కువ ధరకు లభిస్తున్నాయి?
సమాధానం: కనీసం 155 దిర్హామ్‌లకే, అంటే సుమారు ₹4000 రూపాయలకు.
ప్రశ్న 3: ఈ ధరలు ఎంతకాలం ఉంటాయి?
సమాధానం: సెప్టెంబర్ చివరి వరకు లేదా అక్టోబర్ ప్రారంభం వరకు. దీపావళి సమయానికి మళ్లీ పెరుగుతాయి.
ప్రశ్న 4: రౌండ్ ట్రిప్ కూడా చవకగా ఉందా?
సమాధానం: లేదు . వన్‌వే టికెట్లు మాత్రమే చవకగా ఉన్నాయి.
ప్రశ్న 5: ఇప్పుడు టికెట్ బుక్ చేయడం మంచిదా?
సమాధానం: అవును, ఎవరికైనా అత్యవసరం ఉంటే ఇప్పుడే బుక్ చేయాలి.
ఈ లిండక్స్ ద్వారా మీరు విలువైన లోహాల విభాగంలోని మరిన్ని రేట్ల సమాచారం చూసుకోవచ్చు.
Good explanation