Plastic Rate Today – ప్లాస్టిక్ ధరలు ఈరోజు (29 సెప్టెంబర్ 2025)
అందరికీ నమస్కారం
నేను మీ DKTV తెలుగు ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. మేము మీకు ప్రతిరోజూ ఉపయోగపడే ముఖ్యమైన సమాచారం అందిస్తాము , తాజా సమాచారం, ముఖ్యమైన వార్తలు అందిస్తూనే ఉంటాం. మా DKTV తెలుగు ఛానల్లో మీరు ముక్యంగా బంగారం ధరలు, వెండి ధరలు, స్టాక్ మార్కెట్ కి సంబందించిన వార్తలు, మెటల్స్ ( రాగి ,అల్యూమినియం ,ఐరన్ ,స్టీల్,ఇత్తడి ) & ప్లాస్టిక్ (pvc ,ldpe ,hdpe ,pp , ) మొదలగు వాటి యొక్క ధరలు అందిస్తాము , అలాగే రాజకీయ వార్తలు, AP మరియు TG రాష్ట్రాల ముఖ్యమైన వార్తలు ,నేషనల్ న్యూస్ ,ఇంటర్నేషనల్ న్యూస్ మొదలగు వాటి గురించి పూర్తి సమాచారం లభిస్తుంది కనుక వీటి యొక్క న్యూస్ తెలుసుకోవాలంటే మా DKTVTELUGU ఛానల్ వీక్షించండి
ఈరోజు భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ప్లాస్టిక్ ధరల— 29/09/2025
2025 సెప్టెంబర్ 29 ఈ రోజు భారతదేశంలోని ప్రధాన నగరాలలో ప్లాస్టిక్ రా మెటీరియల్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం . మేము ఈ యొక్క ధరలను ప్రధానమునగా ఇండియా లోని ప్రధాన నగరాలలోని ముఖ్యమైన డిస్డ్రీబ్యూటర్ కి కాల్ చేసి ఈ రోజు ధరలను కనుక్కుంటాము ,ప్రతి నగరములో కనీసము 8 నుండి 10 డిస్ట్రిబ్యూటర్స్ కి కాల్ చేసి ధరలను కనుక్కుంటాము ,అందరి రేట్స్ కంపేర్ చేసి అవేరేజ్ ధరలను తెస్తాము కనుక మా యొక్క డేటా 100% ఒరిజినల్ మీరు మెటీరియల్ కొనేటప్పుడు మా ధరలు మీకు తప్పకుండ ఉపయోగపడుతుంది .
PP (Polypropylene) (పాలీప్రొపిలీన్).
(PP) ఒక ముఖ్యమైన థర్మోప్లాస్టిక్ పాలిమర్. ఇది తేలికగా, బలంగా, ఉంటుంది. అందువల్ల దీనిని విభిన్న రంగాల్లో వాడుతున్నారు.
ప్యాకేజింగ్ రంగంలో, PP Raffia ని ప్రధానంగా , షుగర్ బ్యాగులు, రైస్ బ్యాగులు, ఫర్టిలైజర్ బ్యాగులు మరియు సాధారణ ప్యాకేజింగ్ సాక్స్ తయారీలో వాడతారు. PP Film ని పారదర్శక కవర్లు, ఫుడ్ ప్యాకేజింగ్ మరియు లామినేషన్ కోసం ఉపయోగిస్తారు.ఇండస్ట్రియల్ రంగంలో, PP Injection ద్వారా ప్లాస్టిక్ టాయ్స్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, ఎలక్ట్రానిక్ కేసులు తయారు చేస్తారు. PP Copolymer మరింత ఫ్లెక్సిబుల్‌గా ఉండటంతో బలమైన ప్లాస్టిక్ కంటైనర్లు, పైపులు, ఫర్నీచర్‌లో వాడతారు.గృహ ఉపయోగాల్లో, నీటి బకెట్లు, కుర్చీలు, టిఫిన్ బాక్స్‌లు, కప్పులు, కంటైనర్లు, లంచ్ బాక్స్‌లు, స్టోరేజ్ బాక్స్‌లు ఎక్కువగా PP తో తయారు చేస్తారు.
వైద్య రంగంలో, PP ని డిస్పోజబుల్ సిరంజీలు, మెడికల్ ప్యాకేజింగ్ మరియు హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ తయారీలో ఉపయోగిస్తారు.
PRODUCT | MUMBAI | DELHI | BANGALORE | INDORE | AHMEDABAD |
---|---|---|---|---|---|
PP RAFFIA | 85 | 86 | 88 | 87 | 85 |
PP INJECTION | 85 | 87 | 88 | 87 | 85 |
PP FILM | 87 | 89 | 90 | 89 | 88 |
PP COPOLYMER | 91 | 93 | 94 | 98 | 93 |
PP RCP | 98 | 100 | 98 | 101 | 98 |
HDPE RAFFIA | 91 | 92 | 94 | 92 | 92 |
HDPE INJECTION | 90 | 92 | 93 | 91 | 91 |
HDPE BLOW MOULDING | 89 | 92 | 91 | 91 | 90 |
HMHDPE | 89 | 93 | 93 | 92 | 91 |
LDPE FILM | 110 | 116 | 113 | 112 | 112 |
LLDPE FILM | 86 | 87 | 88 | 87 | 86 |
METALLOCENE | 102 | 105 | 106 | 105 | 104 |
PVC | 72 | 72 | 68 | 72 | 73 |
EVA | 130 | 133 | – | – | 131 |
RODUCT | CHENNAI | RAJASTHAN | KANPUR | HYDERABAD | PUNJAB | KERALA |
---|---|---|---|---|---|---|
PP RAFFIA | 87 | 89 | 86 | 88 | 89 | 89 |
PP INJECTION | 87 | 90 | 86 | 88 | 89 | 89 |
PP FILM | 90 | 92 | 88 | 90 | 91 | 90 |
PP COPOLYMER | 94 | 99 | 93 | 95 | 95 | 95 |
PP RCP | 101 | 101 | 98 | 100 | 101 | 102 |
HDPE RAFFIA | 94 | 94 | 93 | 94 | 93 | 94 |
HDPE INJECTION | 92 | 93 | 91 | 93 | 92 | 93 |
HDPE BLOW MOULDING | 93 | 93 | 91 | 93 | 94 | 93 |
HMHDPE | 91 | 93 | 92 | 94 | 94 | 95 |
LDPE FILM | 111 | 114 | 116 | 115 | 117 | 116 |
LLDPE FILM | 88 | 87 | 85 | 89 | 87 | 89 |
METALLOCENE | 104 | 105 | 102 | 106 | 107 | 107 |
PVC | 72 | 72 | 72 | 72 | 73 | 72 |
EVA | 133 | – | – | 133 | – | – |
PP → Polypropylene,
HDPE → High-Density Polyethylene,
LDPE → – Polyethylene,
Metallocene → Metallocene Polyethylene (mPE)
PVC → Poly Vinyl Chloride
EVA → Ethylene Vinyl Acetate
ప్లాస్టిక్ యొక్క ఉపయోగాలు
ప్లాస్టిక్ మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది తేలికగా ఉండటం, బలంగా ఉండటం, నీటిని తట్టుకోవడం, తక్కువ ధరలో లభించడం వలన ప్రపంచవ్యాప్తంగాఎక్కువగా వాడుతున్నారు. మనం ఉదయం కళ్ళు తెరిచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు, ప్లాస్టిక్‌తో తయారైన ఏదో ఒక వస్తువు ను మనం వాడుతూనే ఉంటాం
ప్యాకేజింగ్ రంగంలో ప్లాస్టిక్ వాడకం చాలా ఎక్కువ. నీళ్ల బాటిల్స్ , పాలు కవర్స్ , షాపింగ్ బ్యాగ్, ఆహార పదార్థాల ప్యాకింగ్ అన్నీ ప్లాస్టిక్ ద్వారానే జరుగుతున్నాయి. ఇంటి అవసరాలకు కూడా ప్లాస్టిక్ ముఖ్యమైనది. బకెట్లు, మగ్గులు, కుర్చీలు, స్టోరేజ్ బాక్స్‌లు, కిచెన్‌లో వాడే స్పూన్లు, డబ్బాలు అన్నీ తేలికగా ఉంటాయి, అలాగే ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.నిర్మాణరంగంలో కూడా ప్లాస్టిక్ పైపులు, ఫిట్టింగ్స్, షీట్లు వాడటం సాధారణమే. ఎలక్ట్రికల్ రంగంలో వైర్ల ఇన్సులేషన్, స్విచ్‌లు, సాకెట్లు, ప్లగ్‌లు అన్నీ ప్లాస్టిక్ వాడి తయారు చేస్తారు.
వాహన పరిశ్రమలో కార్ల బంపర్లు, డ్యాష్‌బోర్డులు, ఫ్యూయల్ ట్యాంకులు, సీట్లు వంటి భాగాల్లో ప్లాస్టిక్ వాడకం ఉంటుంది. ఇవి బరువు తగ్గించడంలో, ఖర్చు తగ్గించడంలో సహాయపడతాయి.
మెడికల్ రంగంలో సిరంజ్‌లు, IV బ్యాగులు, డిస్పోజబుల్ వస్తువులు అన్నీ ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. ఇవి ఒకసారే వాడి పారేయడానికి సులభంగా ఉండటం వలన ఇన్ఫెక్షన్ వ్యాప్తి తగ్గుతుంది.వ్యవసాయంలో కూడా డ్రిప్ ఇరిగేషన్ పైపులు, గ్రీన్‌హౌస్ షీట్లు, మల్చింగ్ ఫిల్మ్స్ రూపంలో ప్లాస్టిక్ వాడుతున్నారు. ఇవి నీటిని ఆదా చేయడంలో, పంటలు బాగా పెరగడంలో ఉపయోగపడతాయి.
దుస్తుల రంగంలో పాలిస్టర్, నైలాన్, సింథటిక్ ఫైబర్స్ అన్నీ ప్లాస్టిక్ నుంచే తయారవుతాయి. ఇవి తేలికగా, చక్కగా, మన్నికగా ఉంటాయి.
బొమ్మలు మరియు క్రీడా సామగ్రి కూడా ఎక్కువగా ప్లాస్టిక్‌తో తయారవుతాయి. బంతులు, బాటిల్స్, హెల్మెట్లు, సేఫ్టీ గేర్ అన్నీ ప్లాస్టిక్ ఆధారంగా ఉంటాయి.
ప్రశ్నలు మరియు సమాదానాలు
1: ప్లాస్టిక్ వాడకానికి ఉన్న ప్రయోజనాలు ఏమిటి?
ప్లాస్టిక్ తేలికగా ఉంటుంది, బలంగా ఉంటుంది, తక్కువ ధరలో దొరుకుతుంది. వేర్వేరు ఆకారాల్లో మలచుకోవచ్చు. కాబట్టి ఇది దాదాపు అన్ని రంగాలలో ఉపయోగపడుతుంది.
2: ప్లాస్టిక్ లోపాలు ఏమిటి?
ప్లాస్టిక్ సులభంగా కరగదు (non-biodegradable). ఇది పర్యావరణ కాలుష్యం కలిగిస్తుంది. అలాగే సముద్రాల్లో పడితే జలచరాలకు హాని చేస్తుంది.
3: ప్లాస్టిక్ రీసైకిల్ చేయవచ్చా?
అవును, PET, HDPE, PP వంటి ప్లాస్టిక్ రకాలను రీసైకిల్ చేసి మళ్లీ కొత్త ఉత్పత్తులు తయారు చేయవచ్చు.
4: ఎందుకు ప్లాస్టిక్ విస్తృతంగా వాడుతున్నారు?
ప్లాస్టిక్ తక్కువ ధరలో లభించడం, నీటిని తట్టుకోవడం, తేలికగా ఉండడం, అన్ని రంగాల్లో ఉపయోగపడడం వలన విస్తృతంగా వాడుతున్నారు.
5: ఎక్కువగా వాడే ప్లాస్టిక్ రకం ఏది?
పాలిథిలిన్ (PE) మరియు పాలీప్రొపిలిన్ (PP) రకాలే ఎక్కువగా ప్యాకేజింగ్ మరియు గృహ వస్తువులలో వాడుతున్నారు.
6: ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎలా తగ్గించాలి?
ఒకసారే వాడే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. రీసైకిల్ చేయాలి, మళ్లీ వాడాలి, పర్యావరణానికి అనుకూలమైన వస్తువులను ఎంచుకోవాలి.
7: ప్లాస్టిక్ మన ఆరోగ్యానికి హానికరమా?
కొన్ని ప్లాస్టిక్‌లు (ఉదా: BPA కలిగినవి) ఆహారానికి వాడితే ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ ఫుడ్-గ్రేడ్ సేఫ్ ప్లాస్టిక్ వాడాలి.