LG Electronics India IPO 2025 Details
LG Electronics India Ltd. IPO 2025
LG Electronics ప్రపంచంలో ముఖ్యమైన మరియు పేరు గాంచిన కంపినీలలో ఒకటి గ ఉంది . LG అంటే మన ఇండియా మరియు ప్రపంచములో తెలియని వారు ఉండరు. ముఖ్యంగా LG Electronics అనే కంపెనీ దక్షిణ కొరియా (South Korea) కి చెందిన కంపెనీ కానీ మన దేశంలో అందరు మన ఇండియన్ కంపెనీ లాగానే భావిస్తారు కారణం LG అంతగా మన్నకం పొందింది .
LG ఎన్నో రకాల వస్తువులను అందిస్తుంది ముఖ్యంగా Refrigerators, Washing Machines, Microwaves, Kitchen Products, ACs, Air Purifiers, Cooling Systems TVs (LED, OLED, Smart), Audio Systems, Projectors మొదలగు ప్రోడక్ట్ తయారీలో ప్రసిద్ధిగాంచినది .
LG Electronics 1947లో దక్షిణ కొరియాలోని Seoul నగరంలో స్థాపించబడింది. మొదట ఈ సంస్థ కెమికల్ మరియు ప్లాస్టిక్ ఉత్పత్తులతో మొదలయింది . తరువాత క్రమంగా ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, టెలికమ్యూనికేషన్స్, ఎనర్జీ, కెమికల్స్ లాంటి విభాగాల్లో విస్తరించింది.
LG Electronics India Ltd. 1997లో భారతదేశంలో స్థాపించబడింది.
ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు పరిచయం ఉన్న household పేరు,కొత్త టెక్నాలజీలు, ఇండియన్ మార్కెట్‌కు సరిపోయే ఉత్పత్తులు,After-sales service బలంగా ఉంది.
LG Electronics కి Noida, Pune లో రెండు పెద్ద తయారీ యూనిట్లు ఉన్నాయి. అదనంగా, రెండు సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, 23 రీజినల్ సెంటర్స్, 51 బ్రాంచ్ ఆఫీసులు, 31,000కి పైగా సబ్ డీలర్లు, మరియు దాదాపు 949 సర్వీస్ సెంటర్స్ నడుస్తున్నాయి. కస్టమర్ సపోర్ట్ కోసం 12,590 ఇంజనీర్లు మరియు 4 కాల్ సెంటర్లు ఉన్నాయి.
భారతదేశంలో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు హోమ్ అప్లయెన్సెస్ రంగంలో ప్రసిద్ధి గాంచిన సంస్థ LG Electronics India Ltd. తన IPOతో మార్కెట్లోకి వస్తోంది. ఈ IPO పూర్తిగా Offer For Sale (OFS) రూపంలోనే ఉంది. అంటే, ఈ ఇష్యూ ద్వారా వచ్చిన డబ్బు కంపెనీకి కాకుండా ప్రొమోటర్ LG Electronics Inc. కి వెళ్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లు దీన్ని సాధారణ IPOలా కాకుండా వేరే కోణంలో చూడాలి.
External Resources
Period | Total Income | PAT | EBITDA | Assets | Net Worth |
---|---|---|---|---|---|
FY22 | 17,038.01 | 1,205.60 | 1,665.01 | 9,419.24 | 5,464.32 |
FY23 | 20,108.58 | 1,348.02 | 1,895.12 | 8,992.12 | 4,319.82 |
FY24 | 21,557.12 | 1,511.07 | 2,224.87 | 8,498.44 | 3,735.82 |
Q1 FY25 | 6,466.80 | 679.65 | 958.07 | 9,253.05 | 4,416.34 |
ROCE: 45.31%
RoNW: 40.45%
EBITDA Margin: 10.42%
PAT Margin: 7.01%
EPS (Pre IPO): ₹22.26
EPS (Post IPO): ₹40.05
(LG Electronics India IPO 2025)QIB (Qualified Institutional Buyers): IPOలో గరిష్టంగా 50% వరకు షేర్లు కేటాయించబడతాయి. వీటిలో Mutual Funds, Insurance Companies, Banks, Foreign Institutional Investors (FIIs) ఉంటారు.
(LG Electronics India IPO 2025) Retail Individual Investors (RII): కనీసం 35% షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించబడతాయి. అంటే, సాధారణ పెట్టుబడిదారులు UPI ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.
(LG Electronics India IPO 2025) Non-Institutional Investors (NII / HNI): కనీసం 15% షేర్లు ఈ కేటగిరీకి రిజర్వ్ అవుతాయి. ఇందులో Small HNIs (₹2 lakh–₹10 lakh మధ్య పెట్టుబడి పెట్టేవారు) మరియు Big HNIs (₹10 lakh కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేవారు) ఉంటారు.
Disclaimer
ఈ ఆర్టికల్‌లో ఇచ్చిన LG Electronics India IPO 2025 వివరాలు కేవలం విద్యా మరియు సమాచారం కోసం మాత్రమే. ఇందులో పొందుపరిచిన డేటా పబ్లిక్ సోర్స్‌లు, DRHP మరియు ఫైనాన్షియల్ రిపోర్టుల నుండి సేకరించబడింది. మేము ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్, ఫైనాన్షియల్ లేదా లీగల్ సలహా ఇవ్వడం లేదు. పెట్టుబడి చేసే ముందు తప్పనిసరిగా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ లేదా స్టాక్ బ్రోకర్‌ను సంప్రదించండి. ఈ వివరాల ఆధారంగా మీ పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు మేము బాధ్యత వహించము.
మరిన్ని రోజువారీ మార్కెట్ రేట్లు మరియు వార్తల కోసం DKTV Telugu ను ఫాలో అవ్వండి.
Join on WhatsApp. Join Our Telegram