Wednesday, 15 October 2025 | 03:22 AM
Latest Updates ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ True-Up Charges తగ్గింపు – నవంబర్ 2025 నుండి ప్రజలకు ఉపశమనం LG Electronics India IPO 2025 Details Trualt Bioenergy IPO 2025 | ట్రూఆల్ట్ బయోఎనర్జీ IPO 2025 Plastic Rate Today – ప్లాస్టిక్ ధరలు ఈరోజు (29 సెప్టెంబర్ 2025) విమాన టిక్కెట్ల ధరలు భారీగా తగ్గాయి – దుబాయ్ నుండి ఇండియా లో ఎక్కడికైనా కేవలం 4000 రూపాయలకే .. USఅమెరికాలో H-1B వీసాపై ట్రంప్ కొత్త నిర్ణయం – భారీ ఫీజు భారం, భారతీయులపై పెద్ద ప్రభావం భారతదేశం & తెలుగు రాష్ట్రాల బంగారం, వెండి ధరలు – నేటి తాజా అప్డేట్ (20-09-2025) Copper, Brass, Aluminum, Zinc, Iron & Steel Prices Today – 19 September 2025 Market Update|కాపర్, బ్రాస్, అల్యూమినియం, జింక్, ఇనుము, స్టీల్ రేట్లు – ఈరోజు 19 సెప్టెంబర్ 2025 మార్కెట్ అప్‌డేట్ Today Gold And Silver Prices ఈరోజు బంగారం & వెండి ధరలు – భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాల వివరాలు (16 సెప్టెంబర్ 2025) AP Mega DSC 2025: ఉపాధ్యాయ నియామకాలలో చారిత్రాత్మక మైలురాయి – జిల్లా వారీ పూర్తి వివరాలు Copper, Aluminium, Brass, Zinc, Iron, Steel Prices Today – కాపర్, అల్యూమినియం, బ్రాస్, జింక్, ఐరన్, స్టీల్ ధరలు ఈరోజు Gold Rate Today 15 September 2025 – ఈరోజు బంగారం ధరలు రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ True-Up Charges తగ్గింపు – నవంబర్ 2025 నుండి ప్రజలకు ఉపశమనం LG Electronics India IPO 2025 Details Trualt Bioenergy IPO 2025 | ట్రూఆల్ట్ బయోఎనర్జీ IPO 2025 Plastic Rate Today – ప్లాస్టిక్ ధరలు ఈరోజు (29 సెప్టెంబర్ 2025) విమాన టిక్కెట్ల ధరలు భారీగా తగ్గాయి – దుబాయ్ నుండి ఇండియా లో ఎక్కడికైనా కేవలం 4000 రూపాయలకే .. USఅమెరికాలో H-1B వీసాపై ట్రంప్ కొత్త నిర్ణయం – భారీ ఫీజు భారం, భారతీయులపై పెద్ద ప్రభావం భారతదేశం & తెలుగు రాష్ట్రాల బంగారం, వెండి ధరలు – నేటి తాజా అప్డేట్ (20-09-2025) Copper, Brass, Aluminum, Zinc, Iron & Steel Prices Today – 19 September 2025 Market Update|కాపర్, బ్రాస్, అల్యూమినియం, జింక్, ఇనుము, స్టీల్ రేట్లు – ఈరోజు 19 సెప్టెంబర్ 2025 మార్కెట్ అప్‌డేట్ Today Gold And Silver Prices ఈరోజు బంగారం & వెండి ధరలు – భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాల వివరాలు (16 సెప్టెంబర్ 2025) AP Mega DSC 2025: ఉపాధ్యాయ నియామకాలలో చారిత్రాత్మక మైలురాయి – జిల్లా వారీ పూర్తి వివరాలు Copper, Aluminium, Brass, Zinc, Iron, Steel Prices Today – కాపర్, అల్యూమినియం, బ్రాస్, జింక్, ఐరన్, స్టీల్ ధరలు ఈరోజు Gold Rate Today 15 September 2025 – ఈరోజు బంగారం ధరలు రాష్ట్రాల వారీగా

Trualt Bioenergy IPO 2025 | ట్రూఆల్ట్ బయోఎనర్జీ IPO 2025

Trualt Bioenergy IPO 2025 | ట్రూఆల్ట్ బయోఎనర్జీ IPO 2025

Trualt Bioenergy IPO 2025

భారతదేశంలో బయోఫ్యూయల్స్ రంగం చాలా వేగంగా ఎదుగుతోంది. ముఖ్యంగా ఎథనాల్ ప్రొడక్షన్‌లో దేశం భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతుంది . ఈ రంగంలో , ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించిన మరో పెద్ద IPO Trualt Bioenergy IPO 2025 IPO. ఈ కంపెనీ ప్రస్తుతం ఎథనాల్ రంగంలో అతి పెద్ద ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకుంది.

Trualt Bioenergy Ltd. 2021లో స్థాపించబడింది.చాల తక్కువ సమయంలోనే ఇది ఒక పెద్ద స్థాయి బయోఫ్యూయల్ తయారీ సంస్థగా ఏర్పడింది . కంపెనీ ముక్యంగా ఎక్కువ ఎథనాల్ ప్రొడక్షన్‌పై తయారీలో ఉంది . అదేవిధంగా, కంప్రెస్‌డ్ బయో గ్యాస్ (CBG) రంగంలో కూడా ఇది ముందడుగు వేసింది. భవిష్యత్తులో రెండో తరం ఎథనాల్ (2G Ethanol), సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF), Allied Biochemicals లాంటి విభాగాల్లో కూడా అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తుంది

బయోఫ్యూయల్స్ అనేది పునరుత్పాదక ఇంధన వనరులు. ఇవి వ్యవసాయ పంటలు, పంట వ్యర్థాలు, చెట్ల నూనెలు, జంతు కొవ్వులు, మరియు ఇతర సహజ వనరుల నుండి ఉత్పత్తి చేస్తారు. పెట్రోలు, డీజిల్ వంటి ఫాసిల్ ఫ్యూయల్స్‌కు ప్రత్యామ్నాయం ఇవ్వగల శక్తి ఉంది . ఇవి తక్కువ ఖర్చుతో లభించడం, పర్యావరణానికి హాని చేయకపోవడం వంటి కారణాల వల్ల వేగంగా వినియోగంలోకి వస్తున్నాయి.

transport రంగంలో బయోఫ్యూయల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ఎథనాల్‌ను పెట్రోల్‌తో కలిపి వాహనాల్లో వాడుతున్నారు. ఇది ఇంధన శక్తి పెంచడమే కాకుండా కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా, బయోడీజిల్‌ని వాహనాలు, ట్రక్కులు, బస్సులు వంటి వాటిలో డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు.

బయోఫ్యూయల్స్ వాడకం విద్యుత్ ఉత్పత్తి రంగంలో కూడా ఎక్కువగా ఉంది. పంట వ్యర్థాలు, చెక్క వ్యర్థాలు, మరియు బయో గ్యాస్ ద్వారా విద్యుత్ తయారు చేస్తారు. ఇది గ్రామీణ ప్రాంతాలలో పునరుత్పాదక శక్తి వనరుగా ఎంతో ఉపయోగకరంగా మారింది.

ఇంటి అవసరాల్లో కూడా బయోఫ్యూయల్స్ ఉపయోగపడతాయి. బయోగ్యాస్ లేదా కంప్రెస్‌డ్ బయో గ్యాస్ వంట గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. దీని వలన LPGపై ఆధారం తగ్గుతుంది. అలాగే, బయోఫ్యూయల్స్ వ్యవసాయ రంగానికీ ఉపయోగపడతాయి . రైతులు తమ పంట వ్యర్థాలను బయోఫ్యూయల్ తయారీలో వాడి అదనపు ఆదాయం పొందగలరు.

భవిష్యత్తులో బయోఫ్యూయల్స్ విమానయాన రంగంలో కూడా విస్తృతంగా వాడబడతాయి. Sustainable Aviation Fuel (SAF) రూపంలో వీటిని విమానాల్లో వాడటం ద్వారా పర్యావరణానికి మేలు చేస్తారు. ఇది గ్రీన్ ఎనర్జీ వైపు ఒక పెద్ద ముందడుగు అవుతుంది.

పర్యావరణ పరంగా బయోఫ్యూయల్స్ ప్రాముఖ్యత చాలా ఎక్కువ. పెట్రోల్ డీసెల్ వంటి ఫ్యూయల్స్ వల్ల కలిగే గాలి కాలుష్యం, వాతావరణ మార్పులు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై వీటి ప్రభావం ఉంటుంది. పెట్రోలు, డీజిల్ దిగుమతులను తగ్గించడం వల్ల విదేశీ టాక్స్ ను ఆదా చేసుకోవచ్చు.

గ్రామీణాభివృద్ధి విషయంలో కూడా బయోఫ్యూయల్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది రైతులు పంట వ్యర్థాలను విక్రయించి ఆదాయం పొందగలరు. గ్రామీణ ప్రాంతాల్లో బయోఫ్యూయల్ యూనిట్లు ఏర్పడితే కొత్త ఉద్యోగాలు వస్తాయి. దీని వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.

మొత్తానికి, బయోఫ్యూయల్స్ పునరుత్పాదక ఇంధన వనరులు కావడంతో ఇవి పర్యావరణానికి మేలు చేస్తాయి, దేశానికి ఎనర్జీ సెక్యూరిటీని ఇస్తాయి, ఆర్థిక లాభాలను తెస్తాయి, మరియు గ్రామీణాభివృద్ధికి తోడ్పడతాయి. అందుకే రాబోయే రోజుల్లో బయోఫ్యూయల్స్ వాడకం మరింత ఎక్కువగా ఉంటుంది .

Trualt Bioenergy IPO 2025 IPO షెడ్యూల్ మరియు ముఖ్యమైన వివరాలు

Trualt Bioenergy IPO 2025 IPO
సెప్టెంబర్ 25, 2025న మొదలై సెప్టెంబర్ 29, 2025న ముగుస్తుంది . షేర్ allotment సెప్టెంబర్ 30న జరగనుంది. రిఫండ్ మరియు డీమాట్ అకౌంట్ క్రెడిట్ అక్టోబర్ 1న పూర్తవుతుంది. లిస్టింగ్ అక్టోబర్ 3, 2025న NSE మరియు BSEలో జరుగనుంది.

IPO ప్రైస్ బ్యాండ్ ₹472 – ₹496గా నిర్ణయించారు. లాట్ సైజు 30 షేర్లు. అంటే రిటైల్ ఇన్వెస్టర్ కనీసం ఒక లాట్ కొనాలంటే ₹14,880 పెట్టుబడి పెట్టాలి. రిటైల్ ఇన్వెస్టర్ గరిష్టంగా 13 లాట్లు (390 షేర్లు) వరకు కొనవచ్చు Small HNI 14 లాట్లు (420 షేర్లు), Big HNI 68 లాట్లు (2040 షేర్లు) పెట్టుబడి పెట్టాలి. మొత్తం ఇష్యూ సైజు ₹839.28 కోట్లు. ఇందులో ఫ్రెష్ ఇష్యూ ₹750 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (OFS) ₹89.28 కోట్లు ఉన్నాయి.

కంపెనీ బిజినెస్ మరియు ప్రొడక్ట్స్

Trualt Bioenergy ప్రధానంగా ఎథనాల్ తయారీలో నిమగ్నమై ఉంది. ప్రస్తుతం రోజుకు 2000 KLPD production సామర్థ్యంతో ఇది దేశంలో అగ్రస్థానంలో ఉంది. ఎథనాల్ ప్రధానంగా పెట్రోల్‌లో మిక్స్ చేసి వాహనాలలో కోసం వాడతారు. ఇది పర్యావరణానికి మేలు చేస్తుంది మరియు ఇంధనంపై దిగుమతి ఆధారాన్ని తగ్గిస్తుంది.

ఎథనాల్‌తో పాటు కంపెనీ Compressed Biogas (CBG) కూడా తయారు చేస్తోంది. ఇది నేచురల్ గ్యాస్‌కు ఒక ప్రత్యామ్నాయం. Cooking Gas, Transport Fuel, Industrial Fuel వంటి విభాగాల్లో దీనికి డిమాండ్ ఉంది.

బాలన్స్ షీట్

Trualt Bioenergy ఆర్థిక ఫలితాలు బలంగా ఉన్నాయి. 2025లో కంపెనీ ఆదాయం ₹1,968.53 కోట్లు ఉండగా , 2024లో అది ₹1,280.19 కోట్లు మాత్రమే. అంటే 54% పెరిగింది . లాభం (PAT) 2024లో ₹31.81 కోట్ల నుండి 2025లో ₹146.64 కోట్లకు పెరిగింది. ఇది 361% పెరిగింది .

EBITDA 2024లో ₹188.09 కోట్ల నుండి 2025లో ₹309.14 కోట్లకు పెరిగింది. Net Worth కూడా ₹264.61 కోట్ల నుండి ₹769 కోట్లకు పెరిగింది. కంపెనీ అప్పులు కొంత ఎక్కువగానే ఉన్నప్పటికీ, FY25లో Debt తగ్గి ₹1,549.68 కోట్లకు చేరింది.

ROE 28.27%, PAT Margin 7.69%, EBITDA Margin 16.20%. Debt-to-Equity రేషియో 2.02గా ఉంది. ఇవి కంపెనీకి బలమైన పనితీరును సూచిస్తున్నాయి.

Promoters మరియు Shareholding

Trualt Bioenergy promoters: Vijaykumar Murugesh Nirani, Vishal Nirani, మరియు Sushmitha Vijaykumar Nirani. IPOకి ముందు ప్రొమోటర్ల షేర్‌హోల్డింగ్ 88.20% కాగా, IPO తర్వాత అది 70.55%కి తగ్గుతుంది.

IPO Subscription

Trualt Bioenergy IPOకి మూడో రోజుకి భారీ స్పందన లభించింది.

QIBలు (Institutions) → 148.78 సార్లు

NIIలు (HNI) → 100.07 సార్లు

Retail Investors → 9.95 సార్లు

మొత్తం → 68.93 సార్లు

మొత్తం 19.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అంటే IPOకు మార్కెట్లో పెద్ద డిమాండ్ ఉందని అర్థం.

Strengths(Trualt Bioenergy IPO 2025)

Trualt Bioenergyకి ఉన్న ప్రధాన బలాలు:

భారతదేశంలో అతిపెద్ద Ethanol ఉత్పత్తి సామర్థ్యం.

Ethanol + CBG + Future Chemicals అనే విభిన్న బిజినెస్ మోడల్.

ప్రభుత్వ Ethanol Blending Programme వల్ల డిమాండ్ ఎక్కువ.

బలమైన ఫైనాన్షియల్స్ మరియు వేగంగా పెరుగుతున్న ఆదాయం.

అనుభవజ్ఞులైన Promoters మరియు మేనేజ్‌మెంట్ టీమ్.

Objects of the Issue

IPO ద్వారా వచ్చిన నిధులను కంపెనీ ఇలా వాడనుంది:

కొత్త Ethanol Plant (300 KLPD) కోసం పెట్టుబడి – ₹150.68 కోట్లు

Working Capital అవసరాలకు – ₹425 కోట్లు

General Corporate Purpose

(Trualt Bioenergy IPO 2025) ఇన్వెస్ట్ చేయాలా వద్దా?

Trualt Bioenergy IPOకు వచ్చిన సబ్‌స్క్రిప్షన్ డిమాండ్ చూస్తే ఇది చాలా హాట్ ఇష్యూ అని స్పష్టమవుతోంది. కంపెనీ బలమైన ఫైనాన్షియల్స్, ప్రభుత్వ మద్దతు, భవిష్యత్ అవకాశాలు అన్నీ పాజిటివ్ పాయింట్స్. కానీ అప్పులు ఎక్కువగా ఉండటం, ప్రైసింగ్ కొంత ఎక్కువగా ఉండటం మైనస్ పాయింట్స్.

Trualt Bioenergy IPO 2025 రాబోయే సంవత్సరాల్లో గ్రీన్ ఎనర్జీ మరియు బయోఫ్యూయల్స్ రంగంలో ఒక ప్రధాన మలుపు కావచ్చు. Ethanol blending ప్రోగ్రామ్ వల్ల కంపెనీకి డిమాండ్ నిరంతరం ఉంటుంది. IPOకి రికార్డ్ స్థాయి Subscription రావడం వల్ల మార్కెట్లో ఇది విజయవంతం అవ్వడం ఖాయం.

రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ పెట్టుబడి పెట్టి లిస్టింగ్ గెయిన్స్ ఆశించవచ్చు. కానీ దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి పెట్టేవారికి ఇది మరింత లాభదాయకమవుతుంది.

🔗 Important External Links – Trualt Bioenergy IPO 2025

Disclaimer

ఈ పోస్ట్ ఇచ్చిన సమాచారం కేవలం సాధారణ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఇందులో ఉన్న డేటాను , వివిధ పబ్లిక్ సోర్సెస్ మరియు అధికారిక వెబ్‌సైట్ల నుండి సేకరించబడినవి. మేము అందించిన సమాచారం పూర్తిగా సరిగ్గా ఉండే విధముగా చూసినప్పటికీ ఏవైనా చిన్నతప్పులు లేదా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.

ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సంప్రదించాలి. IPO, షేర్ మార్కెట్ లేదా ఇన్వెస్ట్మెంట్ సంబంధిత రిస్కులు పూర్తిగా వెక్తిగతం ఇన్వెస్టర్ బాధ్యత.

మా వెబ్‌సైట్/బ్లాగ్ ద్వారా ఇచ్చిసమాచారం వాడటం వలన కలిగే ఏ నష్టానికీ మరియు లాభానికి మేము బాధ్యత వహించము.

Related Updates on DKTV Telugu

👉 మరిన్ని రోజువారీ మార్కెట్ రేట్లు మరియు వార్తల కోసం DKTV Telugu ను ఫాలో అవ్వండి.

Leave a Comment

Previous

Plastic Rate Today – ప్లాస్టిక్ ధరలు ఈరోజు (29 సెప్టెంబర్ 2025)

Next

LG Electronics India IPO 2025 Details